జీవ మరియు భౌతిక శాస్త్రాలపై సెమినార్
04.09.2015 నాడు ఈ స్కూల్ లో తెలంగాణా స్టేట్ కౌన్సిల్ అఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ (TSCOST) ఆధ్వర్యంలో జీవ మరియు భౌతిక శాస్త్రాల పై సెమినార్ జరిగింది. ఈ సెమినార్ లో అసిస్టెంట్ ప్రొఫెస్సొర్లు శంకరనారాయణ గారు(భౌతిక శాస్త్రం ) మరియు శ్వేతల(జీవ శాస్త్రం )గార్లు అలాగే రిసోర్స్ పర్సన్స్ శ్యామ్ సుందర్ రెడ్డి మరియు మాధవి గార్లు పాల్గొన్నారు. మాధవి గారు పిల్లలు "వ్యాధి నిరోధకతను ఏ విధంగా పెంపొందించుకోవాలి " అనే అంశం పై వివరించారు. అలాగే శంకర్నారయన్ గారు భౌతిక శాస్త్రంపై పట్టు ఏ విధంగా సాధించవచ్చో సవివవారంగా వివరించారు. పద్యాలు పాటల రూపంలో సాగిన వీరి ఉపన్యాసం అందరినీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు శ్రీ పోతుగంటి నర్సయ్య గారు అధ్యక్షత వహించారు.
No comments:
Post a Comment